E Shram Card Benefits

ఇ – శ్రామ్ కార్డ్ అంటే ఏంటి.

E Shram Card Benefits: దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న ఎందరో ఉద్యోగస్థులు ఎన్నో విధాలుగా ఆయా లాభాలు పొందుతున్నారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ , హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇలా పలు విధాలుగా లాభపడుతున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులే కాకుండా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఈ కోవకు చెందుతారు.

అయితే అసంఘటిత కార్మికులు ముఖ్యంగా రోజువారి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వీధి వ్యాపారులు ఇలా పొట్టకూటి కోసం పనిచేసే కూలీలకు వారి రోజు కూలి తప్ప మరేమీ రాదు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఇ – శ్రామ్ కార్డ్ తీసుకువచ్చింది.

ఇ – శ్రామ్ కార్డ్ ద్వారా కార్మికునికే కాక తన కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుంది. సామాజిక భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
అసంఘటిత రంగంలోని కార్మికులు అంటే ఎవరు, వీటి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, ఎవెరెవరు అర్హులు, దరఖాస్తు విధానం ఇత్యాది వివరాలు తెలుసుకుందాం.

ఇ – శ్రామ్ కార్డ్ ఎవరు అర్హులు

అసంఘటిత రంగంలోని కార్మికులు అందరూ ఈ శ్రీరామ్ కార్డు నమోదుకు అర్హులు. అంటే రోజు వారి వేతనాలు పొందే వారు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, అనధికారిక ఉపాధి లో ఉన్నవారు. ఎలక్ట్రిషన్ లు, ప్లంబర్ లు మొదలగువారు ముఖ్యంగా ఎవరికైతే ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) , ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో సభ్యులు కానీ వారందరూ అర్హులే. అలాగే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాని కార్మికుడు అయి ఉండాలి.

ఇ – శ్రామ్ కార్డ్ రిజిస్ట్రేషన్ కు కావలసిన పత్రాలు

  • కార్మికుని ఆధార్ కార్డు.
  • ఆధార్ కార్డు తో అనుసంధానించిన మొబైల్ నెంబర్.
  • కార్మికుని పేరుమీద బ్యాంకు ఖాతా.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత కలిగిన కార్మికులందరూ ఈ శ్రమ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభతరం క్రింద పేర్కొన్న విధానంలో మీరు లేబర్ కార్డు లేదా ఈ శ్రమ కార్డు ను ధరఖాస్తు చేసుకోగలరు ఇందుకోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఈ శ్రమ పోర్టల్ లో తేలికగా దరఖాస్తు చేసుకోగలరు.

  1. ముందుగా ఆన్ లైన్ లో ఏ శ్రమ పోర్టల్ ను సందర్శించండి
  2. రెజిస్టరైన్ పై క్లిక్ చేయండి
  3. ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ను అలాగే captcha ను ఎంటర్ చేయండి.
  4. మీరు ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారా అని అడుగుతుంది నో (No) మీద క్లిక్ చేయండి.
  5. అలాగే ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారా అని అడుగుతుంది మీ సమాధానంగా నో (No) మీద క్లిక్ చేయండి.
  6. సెండ్ OTP బటన్ పై క్లిక్ చేయండి.
  7. మీ ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి.
  8. మీ చిరునామా, విద్యార్హతలు మొదలగు అవసరమైన వివరములు ఎంటర్ చేయండి.
  9. మీరు ఎందులో నైపుణ్యం కలిగి ఉన్నారో లేదా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు ఎంచుకోండి.
  10. మీ పేరు మీదుగా ఉన్న బ్యాంకు ఖాతా అకౌంట్ నెంబర్ నెంబర్ ను నమోదు చేయండి.
  11. నమోదు చేసిన అన్ని వివరాలు సరైనవా కావా అని నిర్దారించడం కోసం ప్రివ్యూ బట్టన్ పై క్లిక్ చేసి సరిచూసుకోగలరు.
  12. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  13. మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి పంపబడుతుంది ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై బటన్ పై క్లిక్ చేయండి.
  14. పది సంఖ్యగల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కలిగి ఉన్న ఇ – శ్రామ్ కార్డును ను స్క్రీన్ పైన చూడగలరు. డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

వయో పరిమితి

అప్లై చేసుకొనే కార్మికులు 16 నుంచి 59 సంవత్సరాలు కలిగి ఉండాలి.

ఇ – శ్రామ్ కార్డ్ ద్వారా ప్రయోజనాలు ఏమిటి

  • ఈ శ్రీరామ్ కార్డు తీసుకున్న అసంఘటిత కార్మికులు తనకు మాత్రమే కాకుండా తన కుటుంబ కుటుంబీకులకు కూడా లబ్ధి పొందుతారు.
  • ప్రతి నెల 500 నుంచి 1000 రూపాయులు వరుకు తమ అకౌంట్లో జమ అవుతాయి.
  • దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురి అయితే పాక్షిక వికలాంగుడిగా మారితే ఆ కార్మికునికి ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లిస్తుంది.
  • ఒకవేళ పూర్తి వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తన కుటుంబీకులకు చెల్లిస్తుంది.
  • ఇదే కాకుండా తమ పిల్లలు చదువు, స్కాలర్షిప్ పనిముట్లు కుట్టుమిషన్లు తదితర ప్రయోజనాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది
  • 60 సంవత్సరాలు నిండిన కార్మికునికి ప్రతి నెల మూడు వేల రూపాయల పింఛన్ అందుతుంది. అది నేరుగా తమ బ్యాంకు ఖత లోనే జమ అవుతాయి.

ఇ – శ్రామ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా

మీరు అప్పటికే కార్డు ను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అయితే క్రింద పేర్కొన్న విధంగా మీరు కార్డును డౌన్ లోడ్ చేసుకోగలరు.

  1. ముందుగా ఇంటర్నెట్లో ఇ – శ్రామ్ పోర్టల్ ను సందర్శించండి.
  2. మీరు అప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న చేసుకున్నట్లు అయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
  3. అప్డేట్ లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి.
  4. మీ పుట్టిన తేదీ యు ఏ ఎన్ నెంబర్ అలాగే క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.
  5. స్క్రీన్ పై కనిపిస్తున్న మీ వ్యక్తిగత వివరాలను నిర్ధారించుకోండి.
  6. నిర్ధారించుకున్న తర్వాత ఓటీపీ సెండ్ బటన్ పై క్లిక్ చేసి, మీ మొబైల్ కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేయండి.
  7. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఇ – శ్రామ్ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోగలరు.

తరచుగా అడిగే ప్రశ్నలు

 UAN నెంబర్ అంటే ఏమిటి?

UAN అనగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఇది భారతదేశం అంతటా చెల్లుబాటు అవుతుంది. వ్యక్తిగతంగా ఒక్కొక్క కార్మికునికి ఒక్కొ UAN నెంబర్ ప్రభుత్వం నిర్ధరిస్తుంది. వివిధ ప్రయోజనాల కోసం ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “E Shram Card Benefits”

Leave a Comment