NPCIL 2024 Notification Inter ITI Technician B
NPCIL 2024 Notification Inter ITI Technician B: Inter, ITI చేసిన వారికి మంచి అవకాశం: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా 267 operator మరియు maintainer ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు,అరహతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ కోసం వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1.Notification Advt. No.
– NPCIL RR Site/HRM/04/2024
2. ఖాళీల సంఖ్య
- కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ – 152
- కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ మెయింటైనెర్ – 115
3. కావాల్సిన విద్యా అర్హతలు
కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్:
- ఇంటర్మీడియట్ (10+2) సైన్స్ స్ట్రీమ్‌లో MPC (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో) కనీసం 50% మార్కులతో ఉత్తిర్ణులై ఉండాలి.
- 10వ తరగతి పరీక్షలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ మెయింటైనెర్:
- 10వ తరగతిలో సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లలో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
- రెండు సంవత్సరాల సంభందిత ITI ట్రేడ్ లలో (ఎలక్ట్రీషియన్/ఫిట్టర్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్/ మెషినిస్ట్/టర్నర్/వెల్డర్) సర్టిఫికేట్ ఉండాలి.
- రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కోర్సు ల వారు కనీసం ఒక ఏడాది సంభందిత ITI ట్రేడ్ లలో పని అనుభవం కలిగి ఉండాలి.
- లేదా ఒక సంవత్సరం సంభందిత ITI ట్రేడ్ లలో అప్రెంటిస్‌షిప్ చేసిన వారు కూడా అర్హులు.
4. ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22 ఆగష్టు 2024
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09 సెప్టెంబర్ 2024.
5. వయో పరిమితి
- 09 సెప్టెంబర్ 2024 కు గాను 18 నుంచి 24 సంవత్సరాలు కలిగి ఉండవలెను.
6. వయస్సు సడలింపు
వర్గం | వయస్సు సడలింపు |
SC/ST | 05 సంవత్సరములు |
OBC (NCL) | 03 సంవత్సరములు |
PwBD SC/ST | 15 సంవత్సరములు |
PwBD OBC | 13 సంవత్సరములు |
PwBD UR/EWS | 10 సంవత్సరములు |
Ex Servicemen | 03 సంవత్సరములు |
7. ఫీజికల్ స్టాండర్డ్స్
- కనిష్ట ఎత్తు: 160 సెం.మీ.
- కనిష్ట బరువు: 45.5 కి.గ్రా.
8. ఎంపిక ప్రక్రియ
NPCIL ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియలో సమర్థ మరియు నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నియామకాన్ని నిర్ధారించడానికి వివిధ దశలు ఉంటాయి. అవి ఏంటో క్రింద ఇవ్వబడ్డాయి.
- మొదటి దశ ప్రిలిమినరీ టెస్ట్ : అభ్యర్థుల ప్రాథమిక స్క్రీనింగ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా చేయబడుతుంది.
- రెండవ దశ అడ్వాన్స్‌డ్ టెస్ట్ : మొదటి ప్రిలిమినరీ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు రెండవ దశకు హాజరు కావడానికి అర్హులు.
- మూడవ దశ : రెండవ దశ లో అర్హత పొందిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అర్హులు.
- స్కిల్ టెస్ట్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేసే అభ్యర్థులు వారి ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు టెక్నికల్ స్కిల్స్‌ను అంచనా వేయడానికి స్కిల్ టెస్ట్ చేయించుకుంటారు.
స్కిల్ టెస్ట్ కేవలం కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ మెయింటైనెర్ అభ్యర్థులకు మాత్రమే.
9. వ్రాత పరీక్ష
స్టేజి 1 : ప్రిలిమినరీ టెస్ట్
మొత్తం 50 ప్రశ్నలకు గాను 50 మార్కులు . కాల నిడివి 1 గంట మాత్రమే. 1/3 వంతు నెగెటివ్ మర్క్స్ కలవు.
సబ్జెక్టు ప్రశ్నలు | ప్రశ్నలు |
మాథెమాటిక్స్ | 20 |
జనరల్ సైన్స్ | 20 |
జనరల్ అవేర్నెస్ | 10 |
స్టేజి 2: అవ్డ్వాన్సుడ్ టెస్ట్:
- స్టేజ్-1 పరీక్షా లో పాసైన అభ్యర్థులు మాత్రమే స్టేజ్-2 (అడ్వాన్స్‌డ్ టెస్ట్)లో పాల్గొంటారు.
- 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు. రెండు గంటల కల నిడివి.
- మెరిటలిస్ట్ ఆధారంగా కేటగిరీ – II స్టైపెండరీ ట్రైనీ మెయింటైనెర్ అభ్యర్థులు స్కిల్ టెస్ట్ కు ఎంపిక అవుతారు.
10. దరఖాస్తు రుసుము
వర్గం | రుసుము |
UR, OBC, EWS అభ్యర్థులు | 100/- |
ఇతరులు | 0/- |
11. జీత భత్యాలు
- మొదటి సంవత్సరం శిక్షణలో నెలకు ₹20,000/- స్టైఫండ్ పొందుతారు.
- రెండొవ సంవత్సరం శిక్షణలో నెలకు ₹22,000/- స్టైఫండ్ పొందుతారు.
- శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ట్రైనీలు టెక్నీషియన్బి-B పోస్టుకు నియామకం కోసం పరిగణించబడతారు.
- లెవెల్ 3 పే స్ట్రక్చర్ పై 21500/- బేసిక్ పే అందుకుంటారు.
12. పోస్టింగ్ స్థలం
ఎంపికైన అభ్యర్థులు రావత్‌భట రాజస్థాన్ సైట్ (RR సైట్), NPCILలో పోస్ట్ చేయబడతారు. అయితే, వారు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సేవ చేయడానికి నిష్ణాతులై ఉండలి. NPCIL యూనిట్లు/సైట్‌లలో దేనికైనా బదిలీ చేయవచ్చు.
13. గమనిక
ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైటులో పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
Also Read: Fastag Users Alert!
2 thoughts on “NPCIL 2024 Notification Inter ITI Technician B”