ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరో శుభవార్త!!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరో శుభవార్త!!!. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏడాది ఆరున్నర కోట్ల పని దినాలు అదనంగా కేంద్రం కేటాయించింది. దీని ద్వారా లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతారు.
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం లభించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోడీ గారికి మనస్పూర్త్రిగా కృతఙ్ఞతలు తెలియజేసుకున్నారు.
ఉపాధి హామీ పథకం:.
దేశంలోని గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ఉపాధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.మొట్ట మొదటిసారిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు గారి పాలనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రారంభించారు. తర్వాత సంవత్సరాలల్లో ఈ పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంగా పేరు మార్చారు.
మొదట్లో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. అది ఆలా మొత్తం దేశమంతట ఈ ఉపాధి హామీ పథకం క్రింద గ్రామాల్లోని ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ చట్టాన్ని నిర్వహిస్తారు.
21.5 కోట్ల పనిదినాలకు పెంపు:.
అయితే కేంద్రం ఈ పథకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా రాష్ట్రాల వారీగా పనిదినాలును కేటాయిస్తుంది. అలా ఆంధ్ర రాష్ట్రానికి గాను ఈ సారి పదిహేను కోట్ల పని దినాలు వెల్లడించింది. అవి ఈ సంవత్సరం జూన్ మాసానీకే పూర్తి అయిపోయాయి. అదనంగా పనిదినాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
దీనిపై చర్చించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 6.5 కోట్ల పనిదినాలు పెంచేందుకు అంగీకారం తెలిపింది. అప్పుడు మొత్తంగా 21.5 కోట్ల పనిదినాలకు పెరిగాయి. దీని ద్వారా గ్రామాల్లోని 53 లక్షల కుటుంబాలకు లబ్ది కలుగుతుంది అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.