FASTag Users Alert!
FASTag Users Alert! | ఫాస్టాగ్ యూజర్లకు గమనిక : ఫాస్టాగ్ ఉపయోగిస్తున్న వాహనదారులు ఈ నెల అనగా ఆగష్టు 1 2024 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనలు అమలు చేసింది. ఈ ఫాస్ట్ టాగ్ పద్దతిని 2019 లో కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) దీన్ని నిర్వహిస్తోంది. టోల్ ప్లాజా దగ్గర వాహన చోదకులు ఇబ్బందులను పడకూడదనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్ టాగ్ ప్రక్రియను ప్రారంభిచారు. అందుకు గాను ఎప్పటికపుడు ఫాస్టగ్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కొత్త FASTag రూల్స్:
KYC అప్‌డేట్: ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు తమ KYC వివరాలను అక్టోబర్ 31, 2024 లోపు అప్‌డేట్ చేయాలి, ముఖ్యంగా 3 నుండి 5 సంవత్సరాల మధ్య జారీ చేసిన FASTag అకౌంట్లు .
పాత FASTag మార్పు: ఐదేళ్ల కంటే పాత ఏవైనా ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరిగా మార్చుకోవాలి.
వాహన వివరాలను లింక్ చేయడం: అన్ని FASTagలు తప్పనిసరిగా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఛాసిస్ నంబర్‌కు లింక్ చేయాలి .
కొత్త వాహన రిజిస్ట్రేషన్ అప్‌డేట్: కొత్త వాహన యజమానులు కొనుగోలు చేసిన 90 రోజులలోపు వారి ఫాస్ట్‌ట్యాగ్‌ని వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో అప్‌డేట్ చేయాలి.
డేటాబేస్ ధృవీకరణ: FASTag ప్రొవైడర్లు ఖచ్చితమైన డేటాబేస్‌లను ద్రువీకరించాలి.
ఫోటో అప్‌లోడ్: మెరుగైన గుర్తింపు కోసం ప్రొవైడర్లు వాహనం ముందు మరియు ఇరు వైపుల స్పష్టమైన చిత్రాలను అప్‌లోడ్ చేయాలి.
మొబైల్ నంబర్ లింకింగ్: సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు అప్‌డేట్‌ల కోసం ప్రతి ఫాస్టాగ్ యూజర్ తప్పనిసరిగా మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడాలి.
చివరి గడువు: సేవా అంతరాయాలను నివారించడానికి, పూర్తి KYC ప్రక్రియను అక్టోబర్ 31, 2024లోపు పూర్తి చేయాలి.
కొత్త నిబంధనలు:
ఈ నెల ఒకటో తారీకు నుండి వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. గత మూడేళ్లలోపు ఫాస్టాగ్‌ల కేవైసీని అప్‌డేట్ చేయాలి.
ఐదేళ్ల కిందటి ఫాస్టాగ్‌లను కొత్తవి చేయించుకోవాలి . తప్పనిసరిగా ఫాస్టాగ్ Know Your Customer (KYC )ని అప్‌డేట్ చేయించుకోవాలి.
ఇందుకుగాను అక్టోబరు 31 వరుకు గడువు కేటాయించారు. ఆ లోగ తప్పని సరిగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
కొత్తగా వాహనాలు కొనే వారు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును తోలి 90 రోజుల్లోగా ఫాస్టాగ్ నెంబర్ తో అప్‌డేట్ చేయించుకోవాలి.
నిర్ణిత సమయం లోగ అప్డేట్ చేయించుకోక పొతే అది హోటలిస్ట్ లో ఉంటుంది. అప్పటికి అప్డేట్ చేయించుకో లేకపొతే మరో 30 రోజులు గడువు ఉంటుంది.
అయితే ఆ లోగా కుడా అప్డేట్ కాకపోతే మీ ఫాస్ట్ టాగ్ బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. ఈ వివరాలను ఫాస్టాగ్జారీ చేసే కంపెనీలు వేగవంతంగా ద్రువీకరించి, డాటాబేస్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేయాలి. మనం ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మనదై ఉండాలి.
ఫాస్టగ్ అతికించని వాహనాలకు రేటింపు టోల్ ఛార్జ్ చేయాలనీ భారత జాతీయ రహదారుల సంస్థ ఆదేశించింది. విండ్ షీల్డ్ కు ఫాస్ట్ టాగ్ అతికించని యెడల టోల్ ప్లాజా వద్ద అనవసరంగా వాహనాలు బారులు తీరాల్సి వస్తుంది. సజావుగా సాగిపోయే ఈ FASTag పద్దతిని అన్ని వాహనాలు తప్పనిసరిగా విండ్ షీల్డ్ కు ఫాస్ట్ టాగ్ అతికించాలని సూచించారు.
1 thought on “FASTag Users Alert!”