SSC MTS Syllabus 2024: కొత్త పరీక్షా విధానం కోసం ఇప్పుడే చెక్ చేయండి

SSC MTS Syllabus: కొత్త పరీక్షా విధానం కోసం ఇప్పుడే చెక్ చేయండి

SSC MTS Syllabus 2024: కొత్త పరీక్షా విధానం కోసం ఇప్పుడే చెక్ చేయండి: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ యొక్క కొత్త సిలబస్ అలాగే పరీక్షా విధానం ఇటీవలే విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, మల్టీ టాస్కింగ్ మరియు హవల్దార్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ అధికారిక వెబ్సైటులో చెక్ చేసుకోవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS పరీక్షా విధానం 2024 ప్రకారం , ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది మరియు ఈ పరీక్షలో రెండు సెషన్‌లు ఉంటాయి (సెషన్-I & సెషన్-II). ఈ SSC MTS పరీక్ష 2024 అక్టోబర్-నవంబర్‌లో ఉండే అవకాశం ఉంది, కాబట్టి తక్కువ సమయం మిగిలి ఉంది కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ పరీక్షలకు తయారు కావాలి. SSC MTS సిలబస్ మరియు పరీక్షా విధానం, ఎంపిక విధానం, సబ్జెక్ట్‌లు మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

సిలబస్:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిలబస్ MTS 2024లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అనే 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సబ్జెక్టులు అభ్యర్థి యొక్క జ్ఞానం, నైపుణ్యాలను పరీక్షించడానికి SSC MTS పరీక్షలో అడుగుతారు. ఈ పరీక్షలో ఉత్తిరున్త సాధ్నచిన అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ పోస్టులకు ఎంపిక అవుతారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS మరియు హవల్దార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు ముందుగా 2024లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన పరీక్ష యొక్క సిలబస్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ ప్రకారమే పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశముంది. SSC MTS మరియు హవల్దార్ యొక్క సిలబస్, మార్కింగ్ స్కీమ్, ఎగ్జామ్ స్ట్రక్చర్, ఎగ్జామ్ టాపిక్స్ గురించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది.

సెషన్-I & II:

SSC MTS పరీక్షాలో 2 సెషన్‌లు ఉంటాయి, అవి సెషన్-I & సెషన్-II. కాబట్టి SSC MTS మరియు హవిల్దార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు ముందుగా 2024లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన పరీక్షా సరళిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పరీక్ష నమూనా ప్రకారం నిర్వహించబడుతుంది మరియు రెండు సెషన్‌లు ఒకే రోజున నిర్వహించబడతాయి మరియు ఇది తప్పనిసరి అభ్యర్థి రెండు సెషన్లలో కనిపించాలి.

రెండు సెషన్లలో కనీస ఉత్తీర్ణత మార్కులను కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం SC, ST, PWD వర్గాలకు చెందిన అభ్యర్థులు 20% మార్కులు సాధించాలి. జనరల్ (UR) కేటగిరీ అభ్యర్థులు 30% మార్కులు, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ అభ్యర్థులు 25% మార్కులు, EWS కేటగిరీ అభ్యర్థులు 25% మార్కులు సాధించాలి. SSC MTS మరియు హవల్దార్ పరీక్షా సరళి, సెషన్-I మరియు సెషన్-II, పరీక్షా సమయం, పరీక్షా సబ్జెక్టుల గురించిన సమాచారం క్రింద ఇవ్వబడింది.

పరీక్షా విధానం:

సెషన్ 1:

సబ్జెక్టు ప్రశ్నలు  మార్కులు
మాథెమాటిక్స్ ఎబిలిటీ 20 60
రీజనింగ్ ఎబిలిటీ 20 60
మొత్తం 40 120
సమయం 45 నిమిషాలు

 

సెషన్ 2:

సబ్జెక్టు ప్రశ్నలు  మార్కులు
జనరల్ అవేర్నెస్ 25 70
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 70
మొత్తం 50 150
సమయం 45 నిమిషాలు

 

సెషన్-I ఎంపిక ప్రక్రియ మరియు ముఖ్యమైన విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • SSC MTS ఎంపిక ప్రక్రియ 2024 సెషన్-I కోసం కమిషన్ కనీస ఉత్తీర్ణత మార్కులను సాధించాలి.
  • దీని ప్రకారం SC, ST, PWD కేటగిరీ అభ్యర్థులు 20% మార్కులు సాధించాలి.
  • జనరల్ (UR) కేటగిరీ అభ్యర్థులు 30% మార్కులు, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ అభ్యర్థులు 25% మార్కులు, EWS కేటగిరీ అభ్యర్థులు 25% మార్కులు సాధించాలి.
  • SSC MTS హవిల్దార్ పరీక్ష యొక్క మొదటి సెషన్‌లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్ (CBT) ఆధారితంగా ఉంటుంది అంటే ఇది కంప్యూటర్‌లో తీసుకోబడుతుంది.
  • ప్రశ్నలు హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ఉంటాయి.
  • మొదటి సెషన్ పరీక్ష కోసం 45 నిమిషాల సమయ ఇవ్వబడుతుంది అలాగే 40 ప్రశ్నలు అడుగుతారు.
  • మొదటి సెషన్ పరీక్షలో, న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మొత్తం 20 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి మొత్తం 20 ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇవ్వబడతాయి, మొత్తం మార్కులు 120.
  • సెషన్-1 పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

సెషన్-II కోసం ఎంపిక ప్రక్రియ 2024 మరియు ముఖ్యమైనవిషయాలు క్రింద ఇచ్చాము .

  • SSC MTS హవల్దార్ పరీక్ష 2024 రెండవ సెషన్‌లో 50 ప్రశ్నలకు గాను 45 నిమిషాలు సమయం కేటాయించబడింది.
  • రెండవ సెషన్ పరీక్షలో, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
  • ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుండి మొత్తం 25 ప్రశ్నలు మరియు ఇంగ్లిష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ నుండి మొత్తం 25 ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇవ్వబడతాయి, మొత్తం మార్కులు 150.
  • సెషన్-2 పరీక్షలో తప్పు సమాధానాలకు 1 మార్కు నెగెటివ్ మార్కు ఉంటుంది.

ముగింపు:

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ SSC MTS 2024 ఎక్సమ్ పాటర్న్ విడుదల చేసింది. మరింత సమాచారం కోసం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

Also Read: NPCIL Recruitment 2024 Technician-B

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment