Government Schemes: రోజుకు ₹7 కడితే నెలకు ₹5000 పింఛను!

Government Schemes: రోజుకు ₹7 కడితే నెలకు ₹5000 పింఛను!

Government Schemes: రోజుకు ₹7 కడితే నెలకు ₹5000 పింఛను!
అటల్ పెన్షన్ యోజన! కేంద్ర ప్రభుత్వం వయో వృద్దులు కోసం అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది. ఈ పెన్షన్ ద్వారా అరవై సంవత్సరాలు దాటిన వారికీ నెలకు 5000 రూపాయలు వరుకు పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం కోసం ఇప్పటికే దేశంలో చాల మంది ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు. 

ఈ పధకం యొక్క లక్ష్యం:

భారత ప్రభుత్వం అట పెన్షన్ యోజన అనే కార్యక్రమం 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం తక్కువ ఆదాయం వచ్చే వారు, అసంఘటిత కార్మికులకు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారికీ పదవీ విరమణ వయస్సులో అంటే 60 సంవత్సరాలు తరవాత ఒక నమ్మకమైన ఆదాయ వనరు కలిగి ఉండేలా చూడటం. ఈ పథకం కింద అరవై సంవత్సరాలు దాటిన వారికీ ప్రతి నెల 5000 రూపాయల వరుకు పెన్షన్ అందుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ ఖాతాను తెరిచి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పోస్టాఫీసులో కుడా అటల్ పెన్షన్ యోజన దరఖాస్తు చేసుకోవచ్చు. అందు కోసం ఫారమ్‌ను పూరించి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో సమర్పించాలి. ఒకవేళ అటల్ పెన్షన్ యోజన పధకం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, దాని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.

కావాల్సిన పత్రాలు:

  • దరఖాస్తు దారుని ఆధార్ కార్డు
  • ఆక్టివ్ లో ఉన్న బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా.
  • నామినీ వివరాలు.

ఈ పధకం ఎవరి ద్వారా అమలు చేయబడుతుంది?

అటల్ పెన్షన్ పథకాన్ని PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది . మీరు ఈ పథకంలో కనీసం ఇరవై సంవత్సరాలు పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడు, మీరు కోరుకున్న పెన్షన్ తీసుకోవచ్చు.

ఎవరు అర్హులు:

  • అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి, ఒక వ్యక్తి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • శాశ్వత భారతీయ నివాసితుడై ఉండాలి.
  • పింఛను మొత్తాన్ని నేరుగా జమ చేయగల బ్యాంకు ఖాతా వ్యక్తి కలిగి ఉండాలి.
  • దరఖాస్తు దారుని గుర్తింపుకు సరిపోయే ఆధార్ కార్డును కలిగి ఉండాలి.

పెన్షన్ పొందే ప్రక్రియ:

నమోదు: అటల్ పెన్షన్ యోజన పథకంలో పాల్గొనేందుకు, అభ్యర్థి ముందుగా తన దగ్గరలోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కచ్చితంగా ఆ బ్యాంకులో తనకు ఖాతా ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో, అతని నుండి అవసరమైన పత్రాలు మరియు సమాచారం అడుగుతారు. దాదాపు అన్ని జాతీయ బ్యాంకుల్లోను ఈ పధకం అందుబాటులో ఉంటుంది.

పెన్షన్ స్కీమ్ ఎంపిక: దరఖాస్తు దారుడు తనకు ఎంత పెన్షన్ రావాలో దాని బట్టి తాను ఈ స్కీంని ఎంచుకోవాలి. తన వయస్సు మరియు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి 60 సంవత్సరాలు దాటినా తరువాత 5000 రూపాయలు వరుకు పెన్షన్ అందుకుంటారు.

పెన్షన్ స్కీమ్ డిపాజిట్: వ్యక్తి ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని అభ్యర్థుని బ్యాంకు ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేయాలి. అతని వయస్సును బట్టి ఈ మొత్తం నిర్ణయించబడుతుంది.

వయోపరిమితి:

ఈ పథకం కింద పెన్షన్ ప్రారంభించడానికి వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాలు. ఈ పథకంలో చేరడానికి ఒక వ్యక్తి తప్పనిసరిగా ఈ వయస్సు వారై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు:

  • అటల్ పెన్షన్ యోజన కి దరఖాస్తు చేసుకున్న వారు ఆటో డెబిట్ ద్వారా ప్రతి నెల రుసుము చెల్లుబాటు అవుతుంది.
  • ఈ పధకం కోసం18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులందరూ ఈ పథకానికి సభ్యత్వం పొందేందుకు అర్హులు.
  • పెన్షన్ మొత్తాన్ని నెలవారీగా రూ. 1000, 2000, 3000, 4000 మరియు 5000గా ఎంచుకోవచ్చు.
  • ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి, ఎందుకంటే ప్రతి నెల ఖాతా నుండి సహకారం మొత్తం చెల్లుబాటు అవుతుంది.
  • పింఛను పథకం మొదటి వాయిదా చెల్లించడానికి, లబ్ధిదారుడు తప్పనిసరిగా బ్యాంకులో డబ్బును కలిగి ఉండాలి.
  • పెట్టుబడిదారుడి ఆధార్ కార్డులో ఇచ్చిన పేరు మరియు పుట్టిన తేదీ సరిగ్గా ఉండాలి.

Also Read: PMAY Urban 2.0 Apply Process.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “Government Schemes: రోజుకు ₹7 కడితే నెలకు ₹5000 పింఛను!”

Leave a Comment