ITBP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024: Notification Full Details

ITBP Constable Tradesman Recruitment 2024:

ITBP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 143 పోస్టులలో కానిస్టేబుల్ / ట్రేడ్స్ మాన్ (బార్బర్, సఫాయి మరియు గార్డనర్) ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి ఉన్నా అభ్యర్థులు పూర్తి వివరాలు క్రింద వివరించాము.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి ఏది 26-08-2024 ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోగలరు. ఈ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ, అర్హత, దరఖాస్తు తేదీ మొదలైన వాటి గురించి సంక్షిప్తంగా వివరించబడ్డాయి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 జులై 2024
  • దరఖాస్తు చివరి తేదీ: 26 ఆగష్టు 2024

వయో పరిమితి:

ఈ ఉద్యోగానికి అర్హత పొందిన అభ్యర్థులకు కీలకమైన తేదీ 26 ఆగష్టు 2024 నాటితో మీ వయస్సు లెక్కింపబడుతుంది. కావున అభ్యర్థులు మీ వయస్సు పరిమితిని జాగ్రత్తగా పరిశీలించగలరు. నోటిఫికేషన్ నిబంధనలు ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు

ఖాళీల వివరాలు:

పోస్ట్ యొక్క పేరు  పోస్ట్‌ల సంఖ్య
కానిస్టేబుల్ (బార్బర్) 05
కానిస్టేబుల్ (సఫా కర్మచారి) 101
కానిస్టేబుల్ (గార్డనర్) 37
మొత్తం 143

 

విద్యా అర్హత వివరాలు:

కానిస్టేబుల్ (బార్బర్ & సఫాయి కరంచారి)

  • 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాదించాలి.

కానిస్టేబుల్ (గార్డనర్)

  • 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి లేదా.
  • ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ సర్టిఫికెట్ తో పాటు ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి లేదా.
  • సంబంధిత ట్రేడ్‌లో రెండు సంవత్సరాల డిప్లొమో ట్రైనింగ్ అయినా ఉండాలి.

జీత భత్యాలు:

7 వ CPC ప్రకారం పే స్కేల్ లెవెల్-3 లో రూ. 21,700-69,100 వరుకు జీతం అందుతుంది. అలవెన్సుస్ కుడా ఉంటాయి.

కావాల్సిన పత్రాలు:

  • మీరు అప్లై చేసే పోస్ట్ కు కావాల్సిన విద్యా అర్హత.
  • లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో.
  • మీ సంతకం.
  • ఆధార్ కార్డు.
  • రిజర్వేషన్ అభ్యర్థుల కులం/ నాన్ క్రీమీ లేయర్/ EWS సర్టిఫికెట్.
  • ఇతర సంబంధిత పత్రాలు, మీకు ఏవైనా ఉంటే.

ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం:

ITBP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు క్రింద పేర్కొన్నబడ్డ దశల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోగలరు.

  • ముందుగా ITBP అధికారిక వెబ్సైటులోకి వెళ్ళండి.
  • ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి అలాగే సరైన వివరాలతో నమోదు చేసుకోండి.
  • రెజిస్ట్రాటోన్ పూర్తి అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అలాగే మీ మెయిల్ లో రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది.
  • ఇప్పుడు యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి మీ సంబంధిత పోస్టుకు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • తర్వాత అవసరమైన ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • ఇప్పుడు మీ దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

వ్రాత పరీక్షా విధానం:

సబ్జెక్టు ప్రశ్నలు
జనరల్ నాలెడ్జ్ 15
బేసిక్ మాథెమటిక్స్ 10
విశ్లేషణాత్మక ఆప్టిట్యూడ్ 15
ఇంగ్లీష్/హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం 10
మొత్తం 50

 

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) , డాక్యుమెంట్ల వెరిఫికేషన్ , వ్రాత పరీక్ష ఉంటాయి. అలాగే వైద్య పరీక్షలు ఉంటాయి.

ITBP గురించి:

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అనేది భారతదేశంలోని ప్రత్యేక సాయుధ పోలీసు దళం, ఇది చైనాతో దేశం యొక్క సరిహద్దును కాపాడుతుంది. ITBP భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోకి వస్తుంది. 1962 అక్టోబర్ 24న చైనా దురాక్రమణకు మరియు సరిహద్దు రక్షణలో భారతదేశం యొక్క బలహీనతలకు ప్రతిస్పందనగా ITBP స్థాపించబడింది. కరకోరం పాస్ నుండి లిపులేఖ్ పాస్ వరకు విస్తరించి ఉన్న 2,115 కిలోమీటర్ల సరిహద్దును పునర్వ్యవస్థీకరించడం మరియు భద్రపరచడం ITBP యొక్క ప్రాథమిక లక్ష్యం.

Also Read: NPCIL Technician B Notification 2024

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment