PMAY Urban 2.0 Apply Process:
PMAY Urban 2.0 Apply Process: ప్రతి పేద వాడికి సొంత ఇల్లు కట్టుకోవటం ఒక కల. తన కుటుంబంతో సొంత ఇంట్లో ఉండాలని పిల్ల పాపాలతో ఆనందం గా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ పేద వాడికి తనకొచ్చే సంపాదనతో ఇల్లు మాట దేవేడెరుగు ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది. వచ్చిన కొంత మొత్తం ఇంటి అద్దెకే సరిపోతుంది. అలా కల కలగానే మిగిలిపోతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇల్లు లేని ప్రతి పేద వారికీ సొంత ఇల్లు కట్టి ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఈ సారి మరిన్ని ప్రయోజనాలతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నగర్ 2.0 పథకం తీసుకొచ్చింది.
PMAY-U 2.0 అర్బన్:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నగర్ 2.0 పధకం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పధకం ద్వారా 2024 నుంచి 2029 లోపు పట్టణ ప్రాంతాల్లో కోటి గృహాలు నిర్మిచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అర్బన్ 2.0 అనేది పట్టణాల్లో నివసించే పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం నగరాల్లోని హోసింగ్ కమ్యూనిటీని స్థాపించి అర్హులైన లబ్ది దారులకు సరసమైన దారిలో అందించాలని కేంద్రం ఆదేశించింది. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం హెచ్చించాలని తద్వారా నగరాల్లో ఉన్నా పేద మధ్య తరగతి ప్రజలు నిశ్చింతగా జీవించాలి అని భారత ప్రభుత్వం ఈ పధకాన్ని తీసుకొచ్చింది.
PMAY-G గ్రామీణ:
అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పధకం ద్వారా గ్రామాల్లో ప్రజలకు ఈసారి రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కాబినెట్ కూడా అనుమతి తెలిపింది అని సమాచారం. మొత్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్లను నిర్మిచాలని కేంద్రం నిర్ణయించుకుంది. 2024-25 నుండి 2028-29 ఆర్థిక సంవత్సరంలో పట్టన ప్రాంతాల్లో కోటి ఇళ్లను, గ్రామీణ ప్రాంతం లో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మంజారు చేసింది.
ఎవరు అర్హులు?
ఈ పధకం నిబంధనలు ప్రకారం సమాజంలో వెనుకబడిన తరగతి వాళ్ళు, SC/ST, మైనారిటీలు , వికలాంగులు, వితంతువులు, చేతి వృత్తి వారు, వీధి వ్యాపారులు, అంగన్వాడీ కార్మికులు ప్రధానమైన లబ్ధిదారులు. మురికి వాడల నివాసితులతో సహా అట్టడుగు ప్రజలకు ప్రత్యేకంగా ఈ పథకం లభిస్తుంది. అలాగే PMAY పధకం ద్వారా ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS), తక్కువ ఆదాయ సమూహం (LIG), మరియు మధ్య ఆదాయ సమూహం (MIG) విభాగాలకు చెందిన కుటుంబాలు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
PMAY పధకానికి అర్హత కలిగిన ఆదాయ ప్రమాణాలు క్రింది వివరించబడ్డాయి :
- మూడు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు EWS కుటుంబాలు.
- మూడు నుంచి ఆరు లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన LIG కుటుంబాలు.
- ఆరు నుంచి తొమ్మిది లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన MIG-I కుటుంబాలు.
- పన్నెండు నుంచి పద్దెనిమిది లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన MIG-II కుటుంబాలు.
ఈ పథకానికి అర్హత పొందేందుకు లబ్ధిదారుడు లేదా తన కుటుంబ సభ్యులు దేశంలో మరి ఎక్కడ పక్క ఇంటిని కలిగి ఉండకూడదు. మరి ఏ ఇతర ప్రభుత్వ హోసింగ్ పధకాలు తీసుకొని ఉండకూడదు.
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు కోసం క్రింది పేర్కొన్న పత్రాలు కావాల్సి ఉంటాయి.
- గుర్తింపు రుజువు పత్రాలు.
- ఆదాయ రుజువు పత్రాలు.
- చిరునామా రుజువు పత్రాలు.
- ఆస్థి పత్రాలు.
PMAY కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:
PMAY ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి క్రింది సూచించిన ప్రకారం దరఖాస్తు చేసుకోండి:
- దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి అధికారిక PMAY పోర్టల్‌ని సందర్శించండి.
- మీరు వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన తర్వాత, ‘సిటిజన్ అసెస్‌మెంట్’ విభాగానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
- డ్రాప్-డౌన్ మెను ద్వారా ను ఎంచుకోండి.
- మీ ఆధార్ వివరాలను నమోదు చేయండి.
- పేరు, సంప్రదింపు నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ మరియు ఆదాయ వివరాలు వంటి మీ వ్యక్తిగత వివరాలను పూరించండి.
- దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేసి, సబ్మిట్ ముందు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- మీరు సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారం ను ప్రింటవుట్ తీసుకోండి.
ఈ సాధారణ దశలను అనుసరించడం ద్వారా, మీరు PMAY పథకం కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
PMAY కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు విధానం:
మీరు ఆఫ్‌లైన్ ద్వారా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకుంటే క్రింద సూచించిన దశలను అనుసరించండి. ముందుగా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడం, అవసరమైన వివరాలతో నింపడం మరియు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా స్టేట్ నోడల్ ఏజెన్సీలో సమర్పించడం వంటివి ఉంటాయి.
- రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమీప CSC కార్యాలయాన్ని గుర్తించండి.
- కార్యాలయం నుండి దరఖాస్తు ఫారమ్‌ను పొందండి.
- పేరు, వయస్సు, చిరునామా, ఆదాయం మొదలైన వాటితో సహా వ్యక్తిగత సమాచారంతో ఫారమ్‌ను పూరించండి.
- దరఖాస్తు రుసుము రూ.25 (GST మినహా) చెల్లించండి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను CSC కార్యాలయంలో అధీకృత అధికారికి సమర్పించండి.
ముగింపు:
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన గృహాలను అందించడానికి ముఖ్యమైన పధకం. ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు తక్కువ-ఆదాయ వర్గాలతో సహా వెనుకబడిన వారి గృహ అవసరాలను తీర్చడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారులు అధికారిక PMAY పోర్టల్‌ని సందర్శించవచ్చు లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియను కూడా అనుసరించవచ్చు. అర్హత కలిగిన దరఖాస్తుదారులు వారి గృహ రుణ వడ్డీ రేట్లపై సబ్సిడీని పొందవచ్చు, తద్వారా వారు ఇంటిని నిర్మించడం లేదా కొనుగోలు చేయడం మరియు వారి స్వంత ఇంటి కలను సాధించడం సులభతరం చేస్తుంది.
Also Read: PM Suaksha Bima Yojana Benefits.
1 thought on “PMAY Urban 2.0 Apply Process”