AP Nirudyoga Bruthi 2024 On August 15:
AP Nirudyoga Bruthi 2024 On August 15: నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు 2018 అప్పటి ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నిరుద్యోగా భృతి పథకాన్ని ప్రవేశ పెట్టింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రభుత్వం రావడం మూలాన ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యువతకు శాశ్వత ఉద్యోగం వచ్చేంత వరుకు ఇది చేదోడుగా ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
ముందుగా అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్సైటు అయినా యువనేస్తాం పోర్టల్ లోకి వెళ్ళాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ పేరు, వయస్సు, చిరునామా, మీ ఎడ్యుకేషనల్ వివరాలు ఇంకా అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి. చివరిగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి రిఫరెన్స్ ఇది నెంబర్ పొందు పర్చుకోండి. రిఫరెన్స్ ఐడితో తో మీ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు.
నిరుద్యోగ భృతి యొక్క ప్రయోజనాలు
దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులకు ఈ పథకం కింద నెలకు రూ. 3000 ఆర్థిక భత్యం అందుకుంటారు. దీని ద్వారా వారు చేరాలనుకునే గమ్యానికి ఈ ఆర్థిక భత్యం ఎంతగానో ఉపయోగ పడుతుంది. వారు ఏవైనా నైపుణ్యం కోసం నేర్చుకోవడానికి లేదా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సహాయ పడుతుంది. వారి రోజూవారి ఖర్చులకు ఒకరి పై ఆధారపడకుండా ఈ ఆర్థిక భత్యం అవసరపడుతుంది.
అవసరమయ్యే పత్రాలు
- అభ్యర్దుడు తప్పని సరిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసీయుడై ఉండాలి
- అభ్యర్థుని ఆధార్ కార్డు
- మీ ఆధార్ కార్డు తో అనుసంధానించి మొబైల్ నెంబర్
- మీ ఈమెయిల్ ఐడి
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- ఓటర్ కార్డు
- రేషన్ కార్డు
- మీ పేరు మీద బాక్టీవ్ బ్యాంకు అకౌంట్
- కుల ధ్రువీకరణ పత్రం
- కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం
- ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్
విద్యా అర్హత
నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్దుడు డిప్లొమో . డిగ్రీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో పాసై ఉండాలి. ఓకే వేళా ఏవైనా సబీజెక్టులో
ఫెయిల్ అయి ఉంటే ఈ పథకానికి అనర్హులు. అలాగే అభ్యర్దుడు పై చదువులు కనసాగించని వారై ఉండాలి.
వయో పరిమితి
నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 22 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్య ఉన్న వారు మాత్రమే అర్హులు .
యువనేస్తం స్కీమ్యువనేస్తం స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందించే ఈ నిరుద్యోగ భృతి ఉద్యోగం లేని వారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం లక్ష్యం నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, వారి సామర్ధ్యాలను పెంచుకోవడానికి కూడా ఈ ఆర్థిక భత్యం అవసర పడుతుంది . భృతి పొందే నిరుద్యోగులు వారికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసుకోవడానికి, తమ విద్యను ఇంకా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, రాయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ముఖ్యమైన విషయాలు
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిరుద్యోగ పౌరుడై ఉండాలి.
- ఏ ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ వ్యవస్థలోనూ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
- తన పేరు మీదగా ఎలాంటి ప్రవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉండకూడదు.
- ఎలాంటి పై చదువులు కొనసాగించకూడదు
- తప్పని సరిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- అభ్యర్దుని కుటుంభంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. సీబీ టాక్సీ కార్లకు ఇది మినహాయింపు
- అభ్యర్థుని కుటుంబీకులో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండకూడదు
- తప్పని సరిగా తెల్ల రేషన్ కార్డుదారుడు అయి ఉండాలి
- ప్రభుత్వం నుంచి ఐదు లక్షలకు మించి ఋణం తీసుకొని ఉండకూడదు
- గ్రామీణా వాసులకు ఐదు ఎకరాలకు మించి పొలం ఉండరాదు.
ఎప్పుడు అమలవుతుంది
కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం యువ నేస్తం కింద నిరుద్యోగులకు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి ఆర్థిక సహాయం చేస్తానని తన మానిఫెస్టోలో సూచించింది. అదే విధంగా అమలు చేయడానికి సన్నాహాలు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఇప్పటి వరుకు ఎలాంటి అధికారిక ప్రకటన ప్రభుత్వం చేయలేదు. కానీ అధికారుల సమావేశాల ప్రకారం ఈ నెల ఆగస్టు పదిహేను నాడు అధికారిక ప్రకటన విడుదల చేయాబోతుంది అని అనుకుంటున్నారు. ఆలోగా అందరు కావాల్సిన పత్రాలు సిద్ధం చేసి పెట్టుకుంటే మంచిది.
Also read: PM Suraksha Bima Yojana Benefits