PM Suraksha Bima Yojana 2 Lakhs Insurance

PM Suraksha Bima Yojana 2 Lakhs Insurance

PM Suraksha Bima Yojana 2 Lakhs Insurance: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేంద్రం తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పధకాల్లో ఇది ఒకటి. అతి తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తం కవరేజీ వస్తుంది. ప్రతి సంవత్సరం 20 రూపాయలు కట్టి ఈ బీమా పథకం లో చేరవచ్చు. ఇది ఒక ప్రమాద భీమా పథకం లాంటిది. ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదానికిగురై, ప్రీమియం కట్టిన వ్యక్తి మరణించిన లేదా వైకల్యం సంభవించిన రెండు లక్షల వరకు కవరేజీ వస్తుంది రెండు లక్షల వరకు కవరేజి వస్తుంది. ఈ ప్రీమియం మన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ద్వారా కట్టుకోవచ్చు. ఈ బీమా గురుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

వివరాలు:

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రభుత్వం- ప్రయోజత ప్రమాదం బీమా పథకం. శాశ్వత నివాసితులైన భారతీయులందరు ఈ పథకంలో చేరవచ్చు. మీ కుటుంబానికి సురక్ష లాంటిది ఈ బీమా పథకం. కోట్లాదిమంది ప్రజలు ఇప్పటికే సభ్యులుగా చేరారు. ఈ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం నిర్వహించబడుతుంది.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
ప్రారంభించిన తేదీ 9 మే 2015
ఎలాంటి బీమా ప్రమాద బీమా
శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ
వార్షిక ప్రీమియం 20/-
వయస్సు 18 నుండి 70 సం.
లబ్ది దారులు భారతదేశ పౌరులు

 

అర్హతలు:

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో సభ్యులుగా చేరడానికి నిర్ణయించిన అర్హతా ప్రమాణాలు ఇక్కడ పేర్కొన్నబడ్డాయి.

  • మీరు శాశ్వత భారత నివాసితులై ఉండాలి.
  • ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. 
  • మీకు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి.
  • మీరు 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ బీమా లో చేరగలరు.

ప్రయోజనాలు:

  • సంవత్సరానికి కేవలం 20 రూపాయలతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరవచ్చు.
  • బీమా దారుడు ప్రమాదంలో మరణించినట్లయితే, ఆ కుటుంబానికి ఆసరాగా నామినీ పేరు మీద రెండు లక్షలు అందుతాయి.
  • ఒకవేళ ప్రమాదవశాత్తు పాక్షికంగా వైకల్యం సంభవిస్తే బీమాదారునికి, ఒక లక్ష రూపాయలు అందుకుంటారు.
  • ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లో చేరడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.
  • 18 నుండి 70 సంవత్సరాలు మధ్య వయస్సు గల భారతదేశంలోని పౌరులు అందరు అర్హులు.
  • మీరు ఈ బీమా కోసం మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో పూర్తి వివరాలు అడగవచ్చు.
  • ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కష్ట కాలంలో ఆసరాగా నిలుస్తుంది.

ఎలా చేరాలి? 

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కోసం అర్హత కలిగిన భారతీయులందరూ సులభంగా ఇందులో చేరవచ్చు అవి ఎలాగో క్రింద వివరించారు వివరించబడ్డాయి.

  • ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆఫ్లైన్లో పొందడానికి ముందుగా మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కాతాను కలిగి ఉండాలి.
  • ఒకవేళ లేనట్లయితే మీ సమీప బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో కావలసిన పత్రాలు సమర్పించి ఖాతాను తెరవండి.
  • ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఫారంను తీసుకొని వారి సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోగలరు.
  • సంవత్సరానికి ₹20 కట్టి చందాదారులుగా కావచ్చు.
  • మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా నామినీగా ఉంచగలరు.
  • చివరిగా సర్టిఫికెట్ అఫ్ ఇన్సూరెన్స్ తో సభ్యులుగా చేరారు.
  • ఆన్లైన్ లో నమోదు చేయించుకునే వ్యక్తులు నేరుగా మీ బ్యాంకు ఖాతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేరవచ్చు.

ముఖ్యమైన విషయాలు :

వార్షిక ప్రీమియం తప్పని సరిగా జూన్ 1 నుంచి మే 31 లోపు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఆ ఏడాదికి ప్రీమియం కవరేజి లభిస్తుంది. మీరు బీమా తీసుకున్న ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ను ఆక్టివేట్ చేసుకోండి. అది ప్రతి సాంవత్సరం మే చివరి వారం లో ఆటో రెన్యువల్ అవుతుంది. ఆ సమయం లో మీ ఖాతాలో ప్రీమియం చెలించుటకు కానీస మొత్తం లేని యెడల అది రేనేవల్ అవ్వదు. బీమా దారుడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే బీమా ప్రయోజనాలు లభించవు.

హెల్ప్ లైన్ నెంబర్:

ఈ పథకం గురుంచి మీకు ఎటువంటి సందేహాలు ఉన్న లేదా ఫిర్యాదులకైనా క్రింద ఇవ్వబడిన టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించగలరు.

  • నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్: 1800-180-1111
  • ఆంధ్ర ప్రదేశ్ టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-8525
  • తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-8933

 

తరుచుగా అడుగు ప్రశ్నలు:

ఎంత ప్రీమియం కట్టాలి?
ఈ సురక్ష బీమా పథకం కోసం ప్రతి సంవత్సరం రూ. 20 చెల్లించాలి.

ప్రీమియం ఎంత వయస్సు వరుకు కట్టాలి?
18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ బీమా కు అర్హత పొందుతారు.

ఎలా క్లెయిమ్ అవుతుంది?
బీమా దారుడకి అంగ వైకల్యం అయితే బీమా చేయబడిన తన ఖాతాలో జమ అవుతాయి. ఒకవేళ మరణిస్తే కుటుంబానికి సురక్షగా నామినీ లేదా చట్ట పరమైన వారసుడు/ వారసుల ఖాతాకు జమ అవుతాయి.

ఆత్మహత్య చేసుకున్నట్లయితే బీమా ప్రయోజనాలు లభిస్తాయా?
ఒకవేళ బీమా దారుడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే బీమా ప్రయోజనాలు లభించవు.

 

Also Read: E-Shram card benefits

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “PM Suraksha Bima Yojana 2 Lakhs Insurance”

Leave a Comment