TCS ION NQT 2024 Fresher Jobs

TCS ION NQT 2024 Fresher Jobs

TCS ION NQT 2024 Fresher Jobs: డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులందరికీ TCS నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రముఖ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొత్తగా IT ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ద్వారా ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు క్వాలిఫైర్ పరీక్షకు అప్లై చేసుకోవాలి. క్వాలిఫైర్ పరీక్షలో వచ్చిన రిజల్ట్ బట్టి విద్యార్థులు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో అనుసంధానమైన వివిధ కంపెనీలలో ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, పరీక్షా విధానం, సాలరీ అన్ని కూడా ఇక్కడ వివరించబడ్డాయి.

TCS Eligibility

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఫైనలియర్ విద్యార్థులు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  • 2019 నుంచి 2025 మధ్య ఏ స్ట్రీమ్ లో నైనా డిగ్రీ పాసైన విద్యార్థులు అర్హులు.

Age Limit

ఈ ఉద్యోగానికి కనీసం 18 సంవత్సరాలు నిండి డిగ్రీ పాసైన విద్యార్థులు అందరు అర్హులే.

Application Process

  • మొదటిగా ఆన్లైన్ లో TCS Next step అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
  • రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి.
  • ఒకవేళ మీరు ఇంతకుముందే రిజిస్టర్ అయితే లాగిన్ మీద క్లిక్ చేయండి.
  • సెలెక్ట్ కేటగిరీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మీద క్లిక్ చేయండి.
  • ఈ మెయిల్ ఎంటర్ చేసి get OTP బటన్ మీద క్లిక్ చేయండి.
  • మీ మెయిల్ కి వచ్చిన 6 సంఖ్యగల ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • ఒకవేళ ఓటిపి మీ మొబైల్ కి రానియెడల resend OTP మీద క్లిక్ చేయండి.
  • వ్యక్తిగత సమాచారం టాబ్ లోకి వెళుతుంది. అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • అలాగే మీ పేరు, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి I agree బటన్ మీద టిక్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • మరొక టాబ్ లో మీ జెండర్, మొబైల్ నెంబర్, మీ కాలేజీ లేదా యూనివర్సిటీ పేరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్.
  • ఏ సంవత్సరంలో పాసయ్యారు అలాగే మీ దగ్గర్లో ఉన్న టీసీఎస్ ఆఫీస్ ను ఎంపిక చేసుకోండి.
  • Captcha ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • రిజిస్టర్ ఐడి మొబైల్ నెంబర్ను కంఫర్మ్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడానికి continue బటన్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు లాగిన్ అయి తీసేసి ఫిల్ అప్ చేసి మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ని ఎంపిక చేసి అప్లై చేయండి.

Important Dates

  • అప్లికేషన్ ముగింపు తేదీ: 15 ఆగష్టు 2024
  • NQT ఆన్లైన్ పరీక్ష తేదీ: 27 ఆగష్టు 2024

Exam Pattern

  • Round 1: 
    • న్యూమరికల్ ఎబిలిటీ – 20 ప్రశ్నలు
    • రీజనింగ్ ఎబిలిటీ – 20 ప్రశ్నలు
    • వెర్బల్ ఇంగ్లీష్ – 25 ప్రశ్నలు
  • Round 2:
    • అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ- 15 ప్రశ్నలు
    • అడ్వాన్స్డ్ కోడింగ్ – 3 ప్రశ్నలు

Salary

  • CTC : 3.5 to 7 lakhs per annum.

About TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజ కంపెని. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటిసారి ముంబై నగరంలో స్థాపించడం జరిగింది సుమారు 46 దేశాలకు తన సర్వీసును అందజేస్తుంది భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటుతుంది.

దేశీయ ఐటి దిగ్గజం అయినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కన్సల్టెన్సీ, అవుట్ సోర్సింగ్ సహ మరెన్నో సేవలకు నిలయం. అత్యధిక లాభాలు తో దూసుకుపోతున్న టిసిఎస్ అందులో ఉద్యోగాల కోసం ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఇందులో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మానుకోరు. ఎందుకంటే ఎంప్లొయ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ టిసిఎస్.

Also Read: NPCIL 2024 Notification

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment