నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ! జీవిత విశేషాలు
నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ! జీవిత విశేషాలు : ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. 1841 అక్టోబర్ లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండపేట గ్రామం లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సీతమ్మగారు. వారి తల్లి దండ్రులు అనుపిండి భవానీశంకరం, నరసమ్మ. చిన్న నాడే డొక్కా జోగన్న గారిని వివాహం చేసుకొని అలా ఆమె లంకల గన్నవరంలో ఆమె అత్త ఇంటికి చేరుకున్నారు. లంకల గన్నవరానికి మరో పేరు నగరం డెల్టా గన్నవరం.
అప్పట్లో గోదావరి జిల్లాల నడుమ ప్రయాణానికి వాహన సాధకం పడవ ప్రయాణం మాత్రమే. అలా అలసి వచ్చిన ప్రయాణికులకు సీతమ్మ గారి ఇంట్లో నే అన్న పానీయాలు సేవించే వారు. ఎంతమంది వచ్చినా లేదనకుండా నిత్యం అన్నదానం జరిగేది వారింట్లో. పసిపిల్లల పాల నుండి నలత పడిన వారికి పత్యం ఆహారం వరకు అన్ని సమకూర్చేవారు. దైవ ఉపాసకులు, ఉపవాసంలో ఉన్న వారికి కూడా ఫలహారం, అల్పాహారం అందేది వాళ్ళ ఇంట్లో.
సాక్షాత్తు విష్ణుమూర్తి !
ఎప్పుడూ డొక్కా సీతమ్మ గారి చేతిలో ఇత్తడి గరిటె ఉంటూనే ఉండేది. అన్నం వార్పు నుంచి వడ్డించే వరకు ఆమె చేతులతోనే స్వయంగా చేసేవారు. వారికున్న ఆస్తి సంపద మొత్తం అన్నదానానికకే కేటాయించారు. ఒక సందర్భంలో సీతమ్మ గారి భర్త జోగన్న గారు ఉన్నదంతా ధానం చేస్తే నిండుకున్నాక ఎవరైనా మన ఇంటి తలుపు తడితే ఏం పెడతాం అని అడిగారు, అందుకే ఆమె నేను అన్నం పెడుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి కండి, ఆయనే మనకి ఎదోక దారి చూపిస్తారు లేండి అని బదులిచ్చారు. అలా దేవునికే పరీక్ష పెట్టాలి అనిపించిందేమో.
ఒకప్పుడు సీతమ్మ గారు ఒక బాటసారికి అన్నం వడ్డిస్తూ ఉండగా “అమ్మా నా వివాహ నిమిత్తం నాకు కొంచెం డబ్బు అవసరం పడింది. నాకు మీ మెడలో ఆ నగ ధానం చేస్తే నా అవసరం తీరుతుంది, అలా అయితే నేను మీ ఇంట్లో భోజనం చేస్తాను లేకపోతే ఇప్పుడే లేచి వెళ్ళిపోతాను” అని ఆ బాటసారి అన్నాడు. ఆలా అనేసరికి సీతమ్మ గారు వెంటనే భర్తను సంప్రదించారు. అన్నం పెట్టడం వరకు మాత్రమే మన వ్రతం కదా ఇలాంటి ధానాలు ఇప్పుడు మన వల్ల కాదు అని మారం చేశారు జగన్ గారు. అందుకు సీతమ్మ గారు ఆయన భోజనం చేయకుండా లేచి వెళ్ళిపోతాను అన్నందుకు, ఒకరి ఆకలి తీర్చినందుకు నా మనసుకు కుదిట పడదు అని ఆ నగ ఆ బాటసారికి ఇచ్చేశారు. ఆయన భోజనం చేశాక ఆయన కూర్చున్న పీఠకిందే ఆ నగని వదిలి వెళ్ళిపోయాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే మనల్ని పరీక్షించడానికి ఇలా చేశారేమో అని వారి ఇరువురి దంపతులు అనుకున్నారు .
లంకెల బిందెలు!
వారి ఆస్తి అంతా నిండుకుంటున్న సమయంలో జోగన్న గారు, వారికి మిగిలిన ఆ కొద్ధి భూమిని పొలం చేస్తున్నప్పుడు ఆయనకు భూమిలో బంగారు నాణేలతో నిండిన లంకె బిందెలు దొరికాయి. మళ్లీ అలుపెరగని నిత్యాన్నదానం వారి ఇంట్లో కొనసాగుతూనే ఉండేది. ఈమె దాత్రి భావం విన్న ఆనాటి బ్రిటిష్ మహారాజు, భారతదేశానికి చక్రవర్తి అయిన ఎడ్వర్డ్ సెవెన్ డొక్కా సీతమ్మ గారి సమక్షంలో పట్టాభిషేకం చేసుకోవాలని అనుకొని ఒక ఉద్యోగితో కబురు పంపారు.
అందుకు సీతమ్మ గారు నేను ఏ సత్కారాల కోసమో, ప్రశంసలు కోసమో ఈ ధానాలు చేయడం లేదు. నేను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ వారి భర్త జోగన్న గారు కాలం చేశారు. పెళ్ళైన స్త్రీ భర్త గతించాక ఊరు బయటికి వెళ్ళ కూడదని పూర్వం ఆచారం ఉండేది.
అది తెలిసిన మహారాజు ఎడ్వర్డ్ ఎలాగైనా సీతమ్మ గారి సమక్షం లోనే పట్టాభిషేకం జరగాలని కనీసం ఆమె చిత్రపటాన్ని తీసుకురమ్మని ఆదేశించారు, అప్పుడు ఆ మెజిస్ట్రేట్ ఆమె ఫోటో తీసుకొని రాజు వారికి అందించారు
ఎందరో ఉద్దండులు కూర్చున్న ఆసనాలాలో సీతమ్మ గారికి నిర్ణయించిన ఒక ఆసనంలో ఆమె ఫొటోను పెట్టి, ఆ ఫొటోకు నమస్కరించి మహారాజు ఎడ్వర్డ్ సెవెన్ పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ ఫోటో ఇప్పటికీ ఇంగ్లాండ్ పార్లమెంటులో ఉంది. ఇంగ్లాండ్ పార్లమెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో మహానుభావులు, ప్రముఖులు ఫోటోల మధ్య మన డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా ఉండడం విశేషం.
డొక్కా సీతమ్మ ఆక్వేడక్ట్!
2001 ప్రాంతం లో అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు యూకే పర్యటనలో ఉండగా ఆ ఫోటోని చూసి, ఈ కట్టు బొట్టు మన సాంప్రదాయం లాగ ఉందే అని ఆ ఫోటో ని చూసి విషయాలు తెలుసుకున్నారు.
ఇంతటి మహనీయురాలు గురించి ఆలస్యంగా తెలుసుకున్నానని బాధపడ్డారు. అప్పుడు అదే గన్నవరంలో వంతెన నిర్మిస్తూ ఉన్నారు. అప్పటికింకా ఆ వంతెనకు పేరు పెట్టలేదు. సభా సమావేశాలు చేసి ఆ వంతెనకు డొక్కా సీతమ్మ గారి పేరు ఖరారు చేసారు.
మరో సారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టడం హర్షణీయం…
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.